పేదలకు మోదీ సర్కార్ అదిరిపోయే తీపికబురు.. ఆ స్కీమ్ ద్వారా రూ.10 లక్షల బెనిఫిట్ పొందే ఛాన్స్!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పేదలకు అదిరిపోయే శుభవార్త చెబుతోంది. ప్రజా సంక్షేమం కోసం కీలక నిర్ణయాలను తీసుకుంటూ మోదీ సర్కార్ ప్రజలకు మేలు జరిగే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. ఆయుష్మాన్ భారత్ పేరుతో మోదీ సర్కార్ ఒక స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా మన దేశంలోని పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి.

ఐదేళ్ల క్రితం ఈ స్కీమ్ మొదలు కాగా ఈ స్కీమ్ ద్వారా పేదలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఒక్కో కుటుంబానికి ఈ స్కీమ్ ద్వారా 5 లక్షల రూపాయల వరకు బెనిఫిట్ పొందే అవకాశం అయితే ఉండగా కేంద్ర ప్రభుత్వం ఈ లిమిట్ ను ఏకంగా 10 లక్షల రూపాయలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతోంది.

త్వరలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే వచ్చే ఛాన్స్ ఉంది. కేంద్రంలో మరోసారి మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. త్వరలో ప్రవేశపెట్టబోతున్న మధ్యంతర బడ్జెట్ లో ఇందుకు సంబంధించిన ప్రకటన రానుందని భోగట్టా. ఈ స్కీమ్ లిమిట్ ను పెంచడం ద్వారా కేంద్రంపై 12,000 కోట్ల రూపాయల మేర ఆర్థిక భారం పడే ఛాన్స్ అయితే ఉంది.

ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన వెబ్ సైట్ కు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. సరైన సమాచారం ఇచ్చి అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసి ఆయూష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య కార్డును పొందే అవకాశం అయితే ఉంటుంది.