ప్రస్తుత కాలంలో డబ్బుకి ఉన్న ప్రాధాన్యత మరేదానికి లేదు. అందువల్ల ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ప్రస్థుత కాలంలో నాణేల కన్న నోట్లు ఎక్కువ వాడుతున్నారు. అయితే కొన్ని సందర్భాలలో ఆ నోట్లు చిరిగిపోతూ ఉంటాయి. అలా జరిగిపోయిన నోట్లు చెల్లవు. దీంతో వాటిని ఎందుకు పనికిరావని పక్కన పారేస్తూ ఉంటారు. అయితే ఇలా చిరిగిపోయిన నోట్లతో పాటు పాత నోట్లు, కాలిపోయిన నోట్లు కూడా మనం మార్చుకోవచ్చు. ఆ నోట్లోనే ఎలా మార్చుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక ప్రత్యేక ప్రకటన చేసింది. పాత నోట్లు, సగం కాలిన నోట్లు, పాత నాణేలు ఇచ్చి కొత్త నోట్లు నాళాలను తిరిగి పొందవచ్చని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ట్వీట్ చేసింది. అంటే మన వద్ద ఉన్న పాత నోట్లు చిరిగిపోయిన కాలిపోయిన నోట్లు మార్చుకోవటానికి దగ్గరలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి వెళ్లి మన వద్ద ఉన్న పాత నోట్లోనే ఇచ్చి కొత్త నోట్లు తీసుకోవచ్చు. అలాగే మన వద్ద ఉన్న పాత నాణేలు బదులు కొత్త నాణేలు
కూడా పొందవచ్చు. మన వద్ద ఉన్న నోట్లు రెండు మూడు భాగాలుగా చినిగిపోయిన కూడా వాటిని అతికించి పంజాబ్ నేషనల్ బ్యాంకులో మార్చుకోవచ్చు.
అయితే మనం మార్చుకోవాలి అనుకున్న నోట్ల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్నుతో రాయకూడదు. అలాగే రంగు అంటిన నోట్లు కూడా మార్చుకోవటానికి వీలు లేదు. అంతే కాకుండా నోటు మీద అశోక స్తంభం, మహాత్మా గాంధీ చిత్రం, వాటర్ మార్క్ లేకుంటే ఆ నోట్లకు విలువ ఉండదు. అందువల్ల వాటిని బ్యాంకు స్వీకరించదు. అలాగే బాగా కాలిపోయిన నోట్లను కేవలం ఆర్బీఐ లో మాత్రమే తీసుకుంటారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. పాత, చిరిగిపోయిన నోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకులోని ఏదైనా శాఖకి వెళ్లి మార్చుకోవచ్చు. ఇలాంటి నోట్లని మార్చుకోవడానికి బ్యాంకు ఉద్యోగి నిరాకరిస్తే దీనిపై ఫిర్యాదు కూడా చేయవచ్చు. అయితే ఎక్కువగా చిరిగిపోయిన కాలిపోయిన నోట్లకు సమానమైన విలువ ఉండదు.