కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో కిడ్నీలది కీలక పాత్ర. రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా ఒంట్లోని మల్లాలని ఎప్పటికప్పుడు బయటకు పంపించి వేస్తాయి. బీపీ, ఎలక్ట్రోరాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. డయాబెటిస్, హైబీపీ ఉన్నట్లయితే కిడ్నీల పనితీరు మందగిస్తుంది. దీని ద్వారా కిడ్నీలు నెమ్మదిగా పాడైపోయి చివరకు ప్రాణం దక్కకుండా పోయే అవకాశాలు ఎక్కువ. కిడ్నీ సమస్యలను ప్రాథమిక దశలోనే జాగ్రత్తపడాలి.

కిడ్నీ సంబంధిత లక్షణాలు ఇలా ఉంటాయి.మూత్రం రంగు మారిన, మూత్ర సంబంధిత కారణాలు. రుచి సామర్థ్యం, ఆకలి తగ్గుతుంది. రక్తంలోని వ్యర్ధాల కారణంగా వికారం, వాంతులు అవుతాయి. రక్త కణాల సంఖ్య తగ్గుతుంది. ఆక్సిజన్ స్థాయి తగ్గి శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. కిడ్నీ భాగంలో విపరీతంగా నొప్పి ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కిడ్నీ పాడవటానికి ముందస్తు సూచనలు వీటికి తగిన జాగ్రత్తలు వెంటనే తీసుకోవాలి. ముందుగా వీరికి డయాబెటిస్ ఉన్నట్లయితే క్రమం తప్పకుండా అన్ని పరీక్షలు కంపల్సరిగా చేయించాల్సి ఉంటుంది.

కిడ్నీ సమస్యతో బాధపడేవారు తీసుకునే ఆహారం ఏమనగా రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీరు త్రాగాలి. మీరు ఎక్కువగా త్రాగడం వల్ల మలినాలు కిడ్నీలపై తక్కువ ప్రభావాన్ని చూపి బయటకు వెళ్లిపోతాయి. లావుగా ఉండే ఎర్రటి మిర్చిలో విటమిన్ ఏ విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి పొటాషియం అనేది చాలా తక్కువగా ఉంటుంది మన ఆహారంలో తగినంత మిర్చి వాడడం వల్ల కిడ్నీల పనితీరు మెరుగవుతుంది. వెల్లుల్లి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. పచ్చిగా లేదా ఏదైనా ఆహారంతో కలిపి తీసుకుంటే సరిపోతుంది. దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది.

రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ను సంప్రదించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆపిల్లో ఫైబర్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండె జబ్బు, కొలెస్ట్రాల్, డయాబెటిస్ లను నివారించుటలో దోహదపడుతుంది. కాబట్టి కిడ్నీల పనితీరు సక్రమంగా ఉండాలంటే రోజూ ఒక యాపిల్ తినడం ఆరోగ్యకరం.పుట్టగొడుగులలో విటమిన్ బి విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. వీటి ద్వారా కిడ్నీ సమస్యలు తగ్గడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. చూశారుగా ఆహార పదార్థాల వల్ల కిడ్నీ సమస్యలు రాకుండా వచ్చిన సమస్యలను సులువుగా తగ్గించుకోవచ్చు.