ప్రస్తుత కాలంలోప్రతి ఒక్కరూ వారి ఆహార విషయంలో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకున్నారు ఇలా ఆహారంలో మార్పులు చోటు చేసుకున్న కారణంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలోనే పెళ్లయిన వారు పెళ్లి జరిగి కొన్ని సంవత్సరాలు కడుస్తున్న సంతానం కలగకపోవడంతో కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.ఇలా సంతానలేని సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఒక గ్లాస్ ఈ జ్యూస్ తాగడం వల్ల సంతానయోగం కలుగుతుంది.
ప్రతిరోజు సిట్రస్ జాతికి చెందిన దానిమ్మ పండ్లను లేదా దానిమ్మ పండ్ల జ్యూస్ ను తాగితే ఇందులో మన శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటి మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి.అలాగే దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ నీ నియంత్రించి మన సంపూర్ణ ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, మూత్రశయ ఇన్ఫెక్షన్లను అదుపు చేయడంలో దానిమ్మ పండులోని ఔషధ గుణాలు అద్భుతంగా సహాయపడతాయి.
దానిమ్మ గింజల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తికి కారణమయ్యే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి కావున కావున లైంగిక సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు దానిమ్మ గింజల రసాన్ని తాగితే పురుషులు లైంగిక సామర్థ్యం పెరగడంతోపాటు వీర్య కణాల అభివృద్ధి పెంపొంది సంతానలేమి సమస్యలను అధిగమించవచ్చు. ఇలా పిల్లలు లేనటువంటి వారు తమ పని నుంచి కాస్త ఒత్తిడి తగ్గించుకొని ప్రతిరోజు దానిమ్మ జ్యూస్ తాగి ఇతర పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకొని వారి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల సంతానయోగం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.