సంతానలేని సమస్యలతో బాధపడుతున్నారా… ఇలా చేస్తే సంతాన సాఫల్యం కలుగుతుంది తెలుసా?

సాధారణంగా పెళ్లి జరిగిన తర్వాత చాలామందికి సంవత్సరాలు గడుస్తున్న పిల్లలు జన్మించరు.ఇలా సంతానం కలగకపోవడంతో ఎంతోమంది ఎన్నో రకాల హోమాలు పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు.ఇలా సంతాన భాగ్యం కోసం పెద్ద ఎత్తున పూజ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నటువంటి వారు సంతానం కలగాలి అంటే వాస్తు ప్రకారం మూగజీవాలకు ఆహారాన్ని దానం చేయడంతో సంతాన సాఫల్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

మన హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం హిందువులు గోవును పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే గోమాతకు పెద్ద ఎత్తున పూజలు చేస్తూ ఆహారం తిని పెడుతూ ఉంటారు.
ఈ విధంగా ఆవుకు ఆహారం పెట్టడం వల్ల కుండలిలో ఉన్న గ్రహదోషాల నుంచి విముక్తి పొందవచ్చని పండితులు చెబుతున్నారు. సంపద, వంశాభివృద్ధి ఆశించేవారు ఆవుకు పచ్చ గడ్డి, గోధుమ పిండితో చేసిన మిఠాయిలు తినిపించడం ఎంతో మంచిది. ఇలా గోవుకు పచ్చిగడ్డి గోధుమ పిండితో చేసిన మిఠాయిలు తినిపించడంతో సంతానయోగం కలుగుతుంది.

శత్రు పీడ, కష్టాల నుంచి బయటపడేయడానికి చేపలకు ఆహారం అందించడం ఒక సులభమైన మార్గం.అప్పులు చాలా ఎక్కువగా ఉండి అవి తీర్చడానికి ఇబ్బంది పడుతుంటే గోధుమ పిండితో చేసిన ఉండలు లేదా ఎండు మొక్కజొన్న గింజలు తప్పకుండా చేపలకు ఆహారంగా వేయాలి. అయితే ఇలా ఆహారం దానం చేసేవారు సూర్య సమయానికి ముందు చేయాలని పండితులు చెబుతున్నారు.ఇలా మూగజీవాలకు పక్షులకు ఆహారాన్ని దానంగా వేయటం వల్ల సకల సంపదలు కలగడమే కాకుండా దోషాలు కూడా తొలగిపోతాయి.