ప్రస్తుత కాలంలో ఫ్రిడ్జ్ లేనటువంటి ఇల్లు కనిపించడం చాలా అరుదు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ మనకు ఫ్రిడ్జ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది అయితే ఫ్రిజ్లో చలికాలం వస్తేను ఎక్కువగా డీప్ ఫ్రిడ్జ్ లో ఐస్ కొండల కొండలుగా పేరుకుపోతూ ఉండడం మనం చూస్తుంటాము. ఇలా ఐస్ కారణంగా కొన్నిసార్లుడిఫ్రిజి డోర్ పడటం కూడా ఇబ్బందిగా ఉంటుంది ఇలాంటి సమయంలో చాలామంది ఐస్ మొత్తం తొలగించడానికి చాలా కష్టపడుతుంటారు తొలగించడం రాకపోవడంతో చాలామంది స్క్రూ డ్రైవర్లు కత్తులు తీసుకొని ఉపయోగిస్తూ ఉంటారు ఇలా స్క్రూ డ్రైవర్స్ కత్తులు ఉపయోగించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
చేసే సమయాల్లో ఫ్రిడ్జ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో ఉండే డీప్ బాక్సును గమనిస్తే.. సైడ్స్‌లో సన్నని లైన్స్ ఉంటాయి. వీటి గుండా ప్రవహించే గ్యాస్ ఆధారంగానే ఫ్రిడ్జ్ చల్లగా మారుతుంది. అయితే స్క్రూ డ్రైవర్‌తో అవగాహన లేకుండా కొడితే గ్యాస్ ప్రవహించే మార్గానికి రంధ్రం పడే అవకాశాలు ఉంటాయి ఇదే కనుక జరిగితే ఫ్రిడ్జ్‌లో గ్యాస్ పూర్తిగా లీక్ అవుతుంది.ఈ కారణంగా ఫ్రిడ్జ్ కూల్‌గా మారదు. కొన్ని సందర్భాల్లో ఇది కంప్రెషర్ పాడవడానికి కూడా కారణంగా మారుతుంది.
డీప్‌లో పేరుకుపోయిన మంచును తొలగించడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే.. సాధారణంగా డీప్ బాక్సులో ఐస్ పేరుకుపోవడానికి ప్రధాన కారణం.. ఫ్రిడ్జ్‌లో తేమ ప్రవేశించడమే. అందుకే ఫ్రిడ్జ్‌ను పదే పదే తెరవడం, గ్యాప్ ఉండేలా డోర్‌ని మూయకపోవడం లాంటి చేయకూడదు. ఐస్ పేరుకుపోతే వెంటనే నెంబర్‌ను తగ్గించి, మధ్యలో ఉండే బట్‌ను నొక్కాలి. అప్పుడు ఫ్రిడ్జ్ కూలింగ్ పూర్తిగా తగ్గిపోయి ఐస్ కరిగిపోతుంది. క్రమం తప్పకుండా ఫ్రిడ్జ్ శుభ్రం చేయాలి. అలాగే ఫ్రిజ్‌ను కచ్చితంగా డీఫ్రాస్ట్ కూడా చేస్తుండాలి. ఓ గంట పాటు ఫ్రిజ్‌ను స్విచ్ఛాప్ చేసినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి.