ఇద్దరు వ్యక్తులు రిలేషన్ లో ఉన్నారు అంటే వారి బంధం ఎక్కువ రోజులు పాటు సంతోషంగా కొనసాగాలి అంటే ఇద్దరి మధ్య ప్రేమ ఎంత ముఖ్యమో నమ్మకం కూడా అంతే ముఖ్యం.అలాగే వారి బంధం పై వారికి సరైన అవగాహన తప్పనిసరిగా ఉండాలి.అలాకాకుండా మన లైఫ్ పార్ట్నర్ మనం చెప్పినట్లే వినాలని మనం చెప్పిన విధంగానే నడుచుకోవాలని ఎప్పుడూ మనదే ఫై చేయగా ఉండాలని భావించకూడదు.
ఒక కొత్త రిలేషన్ ప్రారంభిస్తున్నప్పుడు మన పార్ట్నర్ గుణగణాలను, వ్యక్తిత్వ స్వభావాన్ని అంచనా వేయగలిగితే భవిష్యత్తు బాగుంటుంది. అలా కాకుండా గుడ్డిగా వారిని నమ్మి రిలేషన్ కొనసాగిస్తూ మధ్యలోనే ఏదైనా సమస్యలు తలెత్తితే ఆ బంధం నుంచి బయట పడాలంటే చాలా కష్టంగా ఒకరితో రిలేషన్ లో ఉన్నప్పుడు అవతల వారి ఆలోచన విధానం వారి మనస్తత్వం ఎలా ఉంటుందో ముందుగా గ్రహించాలి. నువ్వు నాకే సొంతం,నా అనుమతి లేనిదే వేరే వాళ్లతో మాట్లాడకూడదు వంటి నియంతృత్వ ఆలోచనలు ఉన్నట్లయితే ఇలాంటివి మొదట్లో బాగానే అనిపిస్తాయి కొన్ని రోజుల తర్వాత ఈ ఆలోచనలే మీకు మానసిక శాంతిని మీ స్వేచ్ఛను హరిస్థాయి.
ఇలాంటి నియమాలు నిబంధనలు పెట్టే వ్యక్తితో మీ బంధం ఎక్కువ రోజులు కొనసాగదని ముందుగానే గుర్తించాలి. చిన్న చిన్న అనవసరపు విషయాలకే గట్టిగా అరవడం, కళ్ళు పెద్దవి చేసి చూడడం, చేతిలో ఉన్న వస్తువులు నెలకేసి కొట్టడం, చీటికిమాటికి చిరాకు కోపం తెచ్చుకోవడం వంటి లక్షణాలు మొదట్లోనే గుర్తిస్తే వారి నుంచి రిలేషన్ కోరుకోవడం మంచిది కాదు.అవతలి వారు మీకు తగిన గౌరవం ఇవ్వనపుడు ఎక్కువ ఆలోచించకండి. తన గురించిన రహస్యాలను దాచిపెట్టి మీ గురించి ఏవి పట్టించుకోకుండా తిరిగే వారి పట్ల మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇలా ప్రవర్తించే వారితో రిలేషన్ కొనసాగించకుండా మొదట్లోనే వారితో మీ రిలేషన్ పెంచుకోవడం ఎంతో మంచిది.