సాధారణంగా ప్రతిరోజు మనం తినే ఆహారంలో పెరుగు తప్పనిసరిగా తీసుకుంటూ ఉంటాము. ప్రతిరోజు భోజనంలో పెరుగు తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ప్రస్తుత కాలంలో అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజుకి పెరుగుతోంది. మనం తీసుకునే ఆహార విషయంలో మార్పులు రావటం వల్ల ఈ అధిక బరువు సమస్య తలెత్తుతోంది. అయితే ఈ అధిక బరువు సమస్య నుండి బయటపడటానికి చాలామంది వ్యాయామాలు చేయడం, డైట్ చేయటం వంటివి చేస్తుంటారు. అయితే అధిక బరువు సమస్య నివారించటంలో పెరుగు కూడా ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతిరోజు పెరుగు తినటం వల్ల ఆరోగ్యకరంగా బరువు తగ్గవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే బరువు తగ్గటానికి పెరుగు తినటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం. సాధారణంగా పెరుగులో ప్రోబయోటిక్స్ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ప్రతిరోజు పెరుగు తినడం వల్ల శరీరంలో జీర్ణ క్రియ సక్రమంగా జరుగుతుంది. అంతేకాకుండా పెరుగులో వెన్న శాతం ఎక్కువగా ఉండటం వల్ల తొందరగా కడుపు నిండిన భావన కలిగి ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు పెరుగు తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి అనేక రోగాలు దరి చేరకుండా ఉంటాయి. ముఖ్యంగా వేసవికాలంలో పెరుగులో చక్కెర కలుపుకొని తినటం లేదా పెరుగును పలుచని మజ్జిగలా చేసుకుని తాగటం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.
ఇది ఇలా ఉండగా బరువు తగ్గటానికి పెరుగును ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు మూడు పూటల పెరుగు తినటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే పెరుగు తినటం వల్ల అందులో ఉండే ప్రోటీన్స్ మనకి ఎక్కువసేపు ఆకలి వేయకుండా నియంత్రిస్తాయి. అంతేకాకుండా పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అధిక బరువు సమస్యను కూడా తగ్గించవచ్చు. పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి లభించి కడుపు నిండుగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ సమయం ఆకలి వేయదు. ఇక ప్రతిరోజు ఒక కప్పు పెరుగులో కొంచెం మిరియాల పొడి కలుపుకొని తినటం వల్ల కూడా మంచి ఫలితం లభిస్తుంది.