నెలకు 20,000 రూపాయల వేతనంతో డేటా ఎంట్రీ ఉద్యోగ ఖాళీలు.. ఎలా పొందాలంటే?

తెలుగు రాష్ట్రాల్లో కంప్యూటర్ శిక్షణలో అనుభవం ఉండి డేటా ఎంట్రీ చేయగలిగే సామర్థ్యం ఉన్నవాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎవరికైతే ఇంగ్లీష్ పై పట్టు ఉంటుందో, టైపింగ్ చేయగల సామర్థ్యం ఉంటుందో వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. అయితే అలాంటి ఉద్యోగం కావాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూరే విధంగా తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రి శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్ట్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఈ సంస్థ వెల్లడించింది.

35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ, డీసీఏ చదివిన అభ్యర్థులు ఇంగ్లీష్ పై పట్టు ఉంటే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. డేటా ఎంట్రీలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే సులువుగా ఎంపికయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు రోజుకు 750 రూపాయల చొప్పున నెలకు 20,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. http://svimstpt.ap.nic.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 12 నెలలపాటు కాంట్రాక్టు ప్రాతిపదికన విధులు నిర్వహించాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది.

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అభ్యర్థులు ఏడాది తర్వాత గడువు పొడిగించుకోవడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎంతో బెనిఫిట్ కలుగుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.