విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త ఇదే.. సులువుగా లక్ష స్కాలర్ షిప్ పొందే ఛాన్స్!

ప్రస్తుత కాలంలో విద్య చాలా ఖరీదైంది. పిల్లలను స్కూల్, కాలేజ్ లలో చదివించాలంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులను హాస్టల్ లో ఉండి చదివించాలంటే మరింత ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తే స్కాలర్ షిప్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

 

స్కాలర్ షిప్ ద్వారా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకున్న విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. స్కాలర్ షిప్స్, ఫెలో షిప్స్ గురించి పూర్తిస్థాయిలో అవగాహనను కలిగి ఉంటే వీటి ద్వారా సులువుగా ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. జ్ఞాన్‌ధన్ స్కాలర్‌షిప్- 2023 పీజీ విద్యార్థులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పవచ్చు. ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గించడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది.

 

గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి పీజీ చదవాలని భావించే విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైన విద్యార్థులకు లక్ష రూపాయల రివార్డ్ లభించనుంది. https://www.gyandhan.com/gd-scholarship లింక్ ద్వారా ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ.ఎస్.ఆర్.ఐ అనే సంస్థ సైతం ఇండియా ఎంటెక్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్-2023 ను నిర్వహిస్తోంది.

 

జియో ఇన్ఫర్మేటిక్స్ లేదా రిమోట్ సెన్సింగ్, జీఐఎస్, స్పేషియల్ మోడలింగ్ కోర్సులు చేస్తున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 18 సంవత్సరాల వయస్సు ఉండి జియోఇన్ఫర్మేటిక్స్‌లో ఎంటెక్ లేదా ఎమ్మెస్సీ చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. https://www.esri.in/en-in/home వెబ్ సైట్ ద్వారా వివరాలు తెలుసుకుని జులై 10 లోపు ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.

 

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్.ఐ.టీలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు స్కాలర్ షిప్ ను అందిస్తోంది. బీటెక్ కోర్సులు చదువుతూ 8 లక్షల రూపాయల కంటే వార్షికాదాయం తక్కువగా ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కు అర్హత కలిగి ఉంటారు. అర్హతల ఆధారంగా ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.