జాతీయ ఆరోగ్య మిషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వివిధ ఆరోగ్య వ్యవస్థలలో కాంట్రాక్టు ప్రాతిపదికన 234 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు లక్ష రూపాయల వేతనం లభిస్తుంది.
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్, డిస్ట్రిక్ ఎర్లీ ఇంటర్‌వెన్షన్ సెంటర్, ఇతర ఆస్పత్రులలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఫిబ్రవరి నెల 7వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
జనరల్ మెడిసిన్ ఉద్యోగ ఖాళీలు 38 ఉండగా ఓబ్‌స్టేట్రిక్స్ అండ్ గైనకాలజీ ఉద్యోగ ఖాళీలు 37 ఉన్నాయి. పీడియాట్రిషియన్ ఉద్యోగ ఖాళీలు 114 ఉండగా కార్డియాలజిస్ట్/ జనరల్ మెడిసిన్ జాబ్స్ 29, ఎపిడెమియాలజిస్ట్ ఉద్యోగాలు 15 ఉన్నాయి. సంబంధిత స్పెషాలిటీలో ఎంపీహెచ్, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు.
42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు లక్షా 40 వేల రూపాయల వరకు వేతనం లభించనుంది. అనుభవం, రిజర్వేషన్, మెరిట్ ఆధారంగాఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది.