ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు.. భారీ వేతనంతో?

ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీ దిశగా అడుగులు వేస్తోంది. లీగల్ కమ్ ప్రొబేషన్ అధికారి, కౌన్సెలర్,డేటా అనలిస్ట్‌, చౌకీదార్, స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, ఎడ్యుకేటర్‌, వాచ్‌ మెన్,సోషల్‌ వర్కర్‌ ఉద్యోగ ఖాళీలతో పాటు నర్సు, డాక్టర్, ఆయా,జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌, అకౌంటెంట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది.

ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు భారీ వేతనం లభించనుంది. పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా అర్హత ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం అడ్రస్ కు ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి.

42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అన్నమయ్య జిల్లాలో డీసీపీవో, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుండగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో డీసీపీవో, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. వైఎస్సార్‌ జిల్లాలో ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ జరగనుండగా ప్రకాశం జిల్లాలో ప్రొటెక్షన్ ఆఫీసర్, సోషల్‌ వర్కర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది.

ఎన్టీఆర్‌ జిల్లాలో డీసీపీవో, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయంను సంప్రదించడం ద్వారా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.