ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు.. 2.5 లక్షల వేతనంతో?

ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్లానింగ్ డిపార్టుమెంట్ స్వర్ణాంధ్ర@2047 విజన్ ప్రాజెక్ట్ కొరకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీల ఉన్న పోస్టుల భర్తీ దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ అనలిస్ట్, సీనియర్ అడ్వైజర్ ఉద్యోగ ఖాళీలు 4 ఉండగా కన్సల్టెంట్ రీసెర్చ్ అసోసియేట్స్ ఉద్యోగ ఖాళీలు 8, డేటాబేస్ డెవలపర్ జాబ్ 1 ఉండటం గమనార్హం.

అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు వెంటనే దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం 13 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హతతో పాటు అనుభవం ఉన్న ఉద్యోగులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. బీఈ, బీటెక్, బీఎస్సీ, పీజీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టుకు ఎంపికైన వాళ్లకు నెలకు 2 నుంచి 2.5 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది. కన్సల్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 75000 రూపాయల నుంచి 1,50,000 వరకు వేతనం లభిస్తుందని చెప్పవచ్చు.

డేటాబేస్ డెవలపర్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకునెలకు 45 వేల రూపాయల నుంచి 75 వేల రూపాయల వరకు వేతనం లభిస్తుంది. ఉద్యోగ ఖాళీలను బట్టి వయో పరిమితిలో తేడాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏపీలోని విజయవాడలో ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు పని చేయాలి. ఈ నెల 29వ తేదీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.