ప్రస్తుత కాలంలో పిల్లల్ని చదివించడం సులువైన విషయం కాదు. పిల్లలను చదివించాలంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఫీజు లేకుండా పిల్లలను ఫ్రీగా చదివించాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 6 నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాల కోసం ఏపీలోని చాలా జిల్లాల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
మోడల్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన ఉండటం వల్ల విద్యార్థుల కెరీర్ అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ చదవాలనుకునే విద్యార్థులు సైతం మోడల్ స్కూళ్లలో చదువుకోవడం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి ఫీజులు లేకుండా చదివే అవకాశం ఉండటంతో విద్యార్థులకు ఇది సువర్ణావకాశం అనే చెప్పాలి. చాలా పాఠశాలల్లో దరఖాస్తుకు ఈరోజే చివరి తేదీగా ఉంది.
స్టడీ సర్టిఫికెట్లు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, విద్యార్థి తల్లీదండ్రుల ఆధార్ కార్డ్ జిరాక్స్ లు సమర్పించడం ద్వారా మెరిట్ ప్రకారం ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 7వ తరగతి వరకు రాష్ట్రస్థాయి సిలబస్ ఉంటుందని 8, 9 తరగతులకు మాత్రం సెంట్రల్ సిలబస్ ఉంటుందని సమాచారం అందుతోంది. ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలను ఈ స్కూళ్లలో చదివించే అవకాశం ఉంటుంది.
ఈ స్కూళ్లలో మెరుగైన వసతులు ఉండటం విద్యార్థులకు మరింత ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే సులువుగా ఉన్నత చదువులు మంచి మార్కులతో చదివే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.