నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. ఏపీ అంగన్ వాడీలలో భారీగా జాబ్స్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అనకాపల్లి జిల్లాలోని వేర్వేరు గ్రామాల్లో అంగన్ వాడీ కార్యకర్త, మినీ అంగన్ వాడీ కార్యకర్త, హెల్పర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న ఓసీ అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

అనకాపల్లి డివిజన్ లో కార్యకర్త పోస్టులు 3 ఉండగా ఆయాల ఉద్యోగ ఖాళీలు 37 ఉన్నాయి. మినీ కార్యకర్త ఉద్యోగ ఖాళీలు మాత్రం 8 ఉండగా మొత్తం 48 ఉద్యోగ ఖాళిలను భర్తీ చేయనున్నారు. నర్సీపట్నం డివిజన్ విషయానికి వస్తే కార్యకర్త పోస్టులు 6 ఉండగా ఆయాల ఉద్యోగ ఖాళీలు 17, మినీ కార్యకర్త జాబ్ 1 ఉంది. మొత్తం 24 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని తెలుస్తోంది.

21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. కనీసం పదో తరగతి చదివిన మహిళలు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ నెల 4వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా శిశు, అభివృద్ధి పథకం అధికారి, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయానికి ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులను పంపవచ్చు.

అంగన్ వాడీ జాబ్స్ కు పోటీ ఎక్కువగానే ఉండగా అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు సులువుగానే జాబ్ లభించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుసగా జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.