పోస్టాఫీస్ లో ఉద్యోగాలకు మరో భారీ జాబ్ నోటిఫికేషన్.. రూ.60 వేలకు పైగా వేతనంతో?

ఈ మధ్య కాలంలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా పోస్టాఫీస్ నుంచి వరుస జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతూ ఉండటం గమనార్హం. స్కిల్డ్ ఆర్టిజన్స్ ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ సంస్థ సిద్ధమైంది. మొత్తం 5 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. బెంగళూరులో మెయిల్ మోటార్ సర్వీసులో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.

మోటార్ వెహికిల్ మెకానిక్ పోస్టులు 2 ఉండగా ఇతర ఉద్యోగ ఖాళీలు ఒకటి చొప్పున ఉండనున్నాయని సమాచారం అందుతోంది. కాంపిటీటీవ్ ట్రేడ్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని తెలుస్తోంది.

రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. సంస్థ వసంత్ నగర్ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకోవడంతో పాటు చివరి తేదీలోగా దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. భారీ వేతనం లభిస్తున్న నేపథ్యంలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుని జాబ్ నోటిఫికేషన్ ద్వారా బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ కు వీలైనంత వేగంగా దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్ ద్వారా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.