ఈ చిట్కాలు పాటిస్తే ఇంగ్లీష్ లో అద్భుతంగా మాట్లాడవచ్చట.. ఏం చేయాలంటే?

మనలో చాలామంది ఇతరులతో మాట్లాడే సమయంలో తెలుగులో మాట్లాడటానికి ఆసక్తి చూపిస్తారు. ఇంగ్లీష్ లో సరిగ్గా మాట్లాడని పక్షంలో కోరుకున్న ఉద్యోగం రాదని చాలామంది ఫీలవుతారు. ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష కాగా ఈ భాషలో అనర్ఘళంగా మాట్లాడితే మాత్రమే పోటీ ప్రపంచంలో ఎక్కువ అవకాశాలు పొందవచ్చనే సంగతి తెలిసిందే. ఇంగ్లీష్ ను నేర్చుకోవడం మరీ కష్టం అయితే కాదు.

కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా సులువుగానే ఇంగ్లీష్ లో మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసే సమయంలో సబ్ టైటిల్స్ ను చదవడం ద్వారా ఇంగ్లీష్ ను సులువుగా నేర్చుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇంగ్లీష్ పాటలను ఎక్కువగా వినడం ద్వారా తప్పులు లేకుండా సులువుగా ఇంగ్లీష్ మాట్లాడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఏకాంతంగా ఉన్న సమయంలో అద్దంలో చూసుకుంటూ ఇంగ్లీష్ లో మాట్లాడటం వల్ల ఇతరులతో కూడా సులువుగానే ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. స్నేహితులతో, బంధువులతో ఇంగ్లీష్ లో మాట్లాడటం ద్వారా స్కిల్స్ ను పెంచుకోవచ్చు. ఇంగ్లీష్ పుస్తకాలను చదవడం ద్వారా కూడా స్కిల్స్ పెంచుకునే ఛాన్స్ ఉంటుంది.

ఇంగ్లీష్ ను లైఫ్ స్టైల్ లో భాగం చేసుకోవడంతో పాటు సోషల్ మీడియా పోస్ట్ లను సైతం ఇంగ్లీష్ లో పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంగ్లీష్ విషయంలో పొరపాట్లు చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.