డార్క్ సర్కిల్స్ సమస్యతో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో అద్భుతమైన ప్రయోజనాలు!

ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ఎంతోమందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో డార్క్ సర్కిల్స్ సమస్య కూడా ఒకటి. కళ్ల
కింద నల్లటి వలయాలు (డార్క్ సర్కిల్స్) అంటే కళ్ల చుట్టూ చర్మం సాధారణంగా ఉండే రంగు కంటే ముదురుగా మారడం కాగా నిద్రలేమి, అలసట, వయసు, జన్యుపరమైన అంశాలు కూడా డార్క్ సర్కిల్స్ కు కారణం అవుతాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

తగినంత నిద్ర లేకపోవడం వల్ల రక్త ప్రసరణ మందగిస్తుందని చెప్పవచ్చు. దీనివల్ల కళ్ల కింద చర్మం నల్లగా మారుతుంది. వయసు పెరిగే కొద్దీ చర్మం సన్నబడటంతో, కళ్ల చుట్టూ ఉండే రక్తనాళాలు మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు కుటుంబంలో ఈ సమస్య ఉండటం వల్ల కూడా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయని చెప్పవచ్చు. కొన్ని అలెర్జీల వల్ల కళ్ల చుట్టూ వాపు మరియు దురద వస్తే, అది కూడా నల్లటి వలయాలకు దారి తీస్తుంది.

తగినంత నీరు తాగకపోవడం, ఒత్తిడి, ధూమపానం, మద్యం సేవించడం వంటివి కూడా కళ్ల కింద నల్లటి వలయాలకు కారణం అవుతుంది. ముదురు చర్మం ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉంటాయి. తగినంత నిద్ర, తగినంత నీరు త్రాగడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం వంటివి నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడతాయని చెప్పవచ్చు.

చల్లటి ప్యాక్, రోజ్ వాటర్, బంగాళదుంప ముక్కలు, కాఫీ వంటివి నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడతాయి. నల్లటి వలయాలు తీవ్రంగా ఉంటే లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల వస్తే, వైద్యుడిని సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవడం ద్వారా సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు. కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించడానికి మార్కెట్లో చాలా క్రీమ్స్ మరియు సిరంస్ కూడా లభిస్తున్నాయి.