టైఫాయిడ్ సమస్యతో బాధ పడుతున్నారా.. చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలు ఇవే!

ప్రస్తుత కాలంలో కాలంతో, వయస్సుతో సంబంధం లేకుండా ఎంతోమందిని వేధించే ఆరోగ్య సమస్యలలో టైఫాయిడ్ ఒకటని చెప్పవచ్చు. ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య బారిన పడితే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వర్షాకాలం వచ్చిందంటే జలుబు, జ్వరం, ఇన్ఫెక్షన్లతో ఇబ్బందులు పడాల్సి ఉంటుందని చెప్పవచ్చు. కలుషిత ఆహారం, నీళ్ల ద్వారా టైఫాయిడ్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మురికివాడల్లో, చెత్త నిండిన నివాస ప్రాంతాల్లో టైఫాయిడ్‌ జ్వరాలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ వ్యాధి బారిన పడటానికి సాల్మనెల్లా ఎంటెరికా సెరోవార్‌ టైఫి అనే బ్యాక్టీరియా కారణమవుతుంది. టైఫాయిడ్ వల్ల ప్రతి సంవత్సరం లక్ష కంటే ఎక్కువమంది మరణిస్తున్నారంటే ఈ వ్యాధి బారిన పడితే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో సులువుగా అర్థమవుతుంది.

ఎవరైతే టైఫాయిడ్ ఆరోగ్య సమస్య బారిన పడతారో వాళ్లను తీవ్రమైన జ్వరం, ఆకలి బాగా మందగించడం, తలనొప్పి, హార్ట్‌బీట్‌ రేటు బాగా తగ్గడం, రక్తంలో తెల్లరక్తకణాల కౌంట్‌ తగ్గడం, డయేరియా, పొట్టనొప్పి, ఒళ్లంతా నొప్పులు, తీవ్రమైన అలసట, నిస్సత్తువ, నీరసం లాంటి సమస్యలు వేధించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. శరీరంలోకి బ్యాక్టీరియా ప్రవేశించిన వారం నుంచి రెండు వారాల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయి.

ఈ జ్వరం బారిన పడితే జ్వరం 104 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తాగడం, వెల్లుల్లి, తులసి, యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌, కోల్డ్ కంప్రెస్ సహాయంతో టైఫాయిడ్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. చల్లటి నీటిలో ఒక క్లాత్ తడిపి పేషెంట్ నుదిటిపై ఉంచడం ద్వారా శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.