సొరియాసిస్, ఇతర చర్మ సమస్యలతో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో చెక్!

ఈ మధ్య కాలంలో చాలామందిని చర్మ సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయి. శరీరానికి సరిపడని ఆహారం తిన్నా చర్మం అలర్జీకి గురయ్యే అవకాశాలు ఉంటాయి. చర్మానికి సరిపడని ఉత్పత్తులు వాడినా సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సొరియాసిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చర్మం మీద ఎర్రగా కందిపోయినట్టు ప్యాచ్ లు గా వచ్చి పొట్టు రాలిపోతుంటే సొరియాసిస్ వ్యాధి కావచ్చు.

మోచేతులు, మోకాలు, నెత్తిమీద ప్యాచెస్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సొరియాసిస్ వ్యాధి బారిన పడిన వాళ్లలో చర్మం మండినట్టు ఉండటంతో పాటు రోజువారీ పనులు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది. పొడి చర్మం ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. సొరియాసిస్ కొన్ని సందర్భాల్లో గోళ్లను సైతం ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది.

సొరియాసిస్ ఆర్థరైటిస్ సమస్యతో బాధ పడేవాళ్లలో కీళ్లలో వాపు, నొప్పి ఎక్కువగా ఉండటంతో పాటు కీళ్ల దృఢత్వం, కీళ్ల పనితీరు మందగిస్తాయి. సోరియాసిస్ సమస్యలో చర్మం పొలుసులుగా ఏర్పడితే అది క్రమంగా రాలిపోయే అవకాశాలుంటాయి. చర్మం మీద దురద, పుండ్లు, రక్తస్రావం వంటివి జరిగి చర్మానికి నష్టం చేకూరుతుందని చెప్పవచ్చు.

చర్మ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు వైద్యులను సంప్రదించడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు. సొరియాసిస్ కు సొంత వైద్య చిట్కాలు మరీ ఎక్కువగా ప్రభావం చూపించవు. చర్మ సమస్యల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం దీర్ఘకాలంలో ఇబ్బందులు పడక తప్పదు.