మనలో చాలామంది ఏవైనా చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు వేధిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స దిశగా అడుగులు వేస్తారు. ఈ సమస్య గురించి ఇతరులకు చెప్పుకోవడానికి కూడా సిగ్గు పడరు. అయితే పైల్స్ సమస్య మాత్రం అలా కాదు. ఈ సమస్య గురించి ఇతరులకు చెప్పాలన్నా కూడా చాలామంది సంకోచిస్తారు. పిత్త దోషం ఎక్కువైతే అది రక్త మొలలకు దారి తీసే అవకాశం ఉండగా వాతం, కఫం ఎక్కువైతే డ్రై ఫైల్స్ సమస్య బారిన పడతాం.
అయితే కొన్ని ఆయుర్వేద చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యకు సులువుగా చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. కలబంద గుజ్జు తినడం వల్ల మొలల సమస్య వచ్చే అవకాశాలు అయితే తగ్గుతాయని చెప్పవచ్చు. కలబంద గుజ్జు తీసుకోవడం ద్వారా బాహ్య మొలలతో పాటు అంతర్గత మొలల సమస్యకు సైతం సులువుగానే చెక్ పెట్టే అవకాశాలు ఉంటాయి.
జీలకర్ర, సోంపు ద్వారా పైల్స్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. జీలకర్ర వేయించి పంచదారతో కలిపి మెత్తని చూర్ణంగా చేసుకొని రోజుకు 2 లేదా 3 సార్లు తీసుకోవాలి. మొలల సమస్య తగ్గించడంలో బొప్పాయి అద్భుతంగా పని చేస్తుంది. పైల్స్ సమస్య ఉన్నవారు వీలైనంత వరకు ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు.
ఈ చిట్కాలు పాటించినా ఫలితం లేకపోతే మాత్రం వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది. కొన్నిసార్లు పైల్స్ సమస్యకు ఆపరేషన్ అవసరం అవుతుంది. పైల్స్ సమస్య వల్ల కొన్నిసార్లు ప్రశాంతంగా పనులు చేయడం కూడా సాధ్యం కాదని చెప్పవచ్చు. ఈ సమస్య కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం కలిగిస్తుంది.