ఈ మధ్య కాలంలో అరికాళ్లలో మంట సమస్య ఎక్కువమందిని వేధిస్తోంది. ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య వల్ల ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా అరికాళ్లలో మంట సమస్య శాశ్వతంగా దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
నరాల దెబ్బతినడం (పరిధీయ న్యూరోపతి), చర్మ సంక్రమణ, అలసట, వ్యాయామం, కిడ్నీ వ్యాధులు, విటమిన్ లోపం, హైపోథైరాయిడిజం, ఇన్ఫెక్షన్లు, పాదాల వాపులు, మానసిక సమస్యలు ప్రధానంగా ఈ సమస్యకు కారణం అయ్యే అవకాశాలు ఉంటాయి. మధుమేహం, దీర్ఘకాలిక మద్యపానం, కొన్ని విష పదార్థాలకు గురికావడం కొన్ని బి విటమిన్ లోపాలు, హెచ్ఐవి ఇన్ఫెక్షన్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా ఈ సమస్యకు కారణం అయ్యే ఛాన్స్ ఉంటుంది.
కంప్రెషన్ స్టాకింగ్స్ ధరించడంతో పాటు విటమిన్ బీ12 సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టడంతో పాటు మంచి ఫలితాలను పొందవచ్చు. కొన్ని సందర్భాల్లో రక్త హీనత సమస్య వల్ల కూడా అరికాళ్లలో మంటలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కొన్ని సందర్భాల్లో ప్రాణాలకే ప్రమాదం కలిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువ కాలంపాటు కంట్రోల్లో లేకపోవడం వల్ల కూడా అరికాళ్లల్లో మంట సమస్య వేధిస్తుంది. మధుమేహ బాధితుల్లోని రక్తనాళాలు బలహీన పడటం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో వేర్వేరు ఆరోగ్య సమస్యలు తలెత్తి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. శరీరంలోని వివిధ భాగాలకు సరిగా రక్త ప్రసరణ జరగని సమయంలో కూడా పాదాల్లో మంట, నొప్పులు అనేవి ఎక్కువగా వేధించే ఛాన్స్ ఉంటుంది.
