ఈ మధ్య కాలంలో పాదాలకు సంబంధించిన సమస్యలతో బాధ పడేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పాదాల సమస్యలు చిన్న సమస్యలలా అనిపించినా ఈ సమస్య వల్ల సరైన నిద్ర ఉండకపోవడంతో పాటు వేర్వేరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా పాదాల సమస్యలు దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
చలికాలంలో చర్మ సంరక్షణ విషయంలో తగిన జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. కాలిలో పగుళ్లు, చారికలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కాలి పగుళ్లకు సులువుగా చెక్ పెట్టవచ్చు. స్నానానికి ముందు పాదాలను ఫ్యూమిన్ స్టోన్ తో రాయడంతో పాటు ఆ తర్వాత కొబ్బరి నూనె రాయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు.
ఇంట్లో కాళ్లను పెడిక్యూర్ చేసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు. టబ్ లో గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో లిక్విడ్ సోప్, డెటాల్, షాంపూ వేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. గోరువెచ్చని నీటిలో కాళ్లను ఉంచి మెత్తటి బ్రష్ తో శుభ్రం చేసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందే ఛాన్స్ ఉంటుంది. ఈ చిట్కాలను పాటించడం ద్వారా పాదాలకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి.
పాదాలకు సంబంధించిన సమస్య విషయంలో నిర్లక్ష్యం వహించడం మంచిది కాదు. పాదాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్ని వారాలు ఉన్నా నొప్పి తగ్గకపోతే వైద్యులను సంప్రదించడం ద్వారా సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది.