బీపీ సమస్యతో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే సమస్యలకు చెక్!

ప్రస్తుత కాలంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు బీపీ సమస్యతో బాధ పడుతున్నారు. ఒకసారి బీపీ బారిన పడితే జీవితాంతం మందులు వాడాల్సిందే అని వైద్యులు చెబుతున్నారు. బీపీ సైలెంట్ కిల్లర్ అని కూడా వైద్యులు చెబుతున్నారు. బీపీని సహజసిద్ధంగా నియంత్రణలో ఉంచుకునేందుకు కొన్ని ఆయుర్వేద చిట్కాలు పాటించాలని వైద్యులు చెబుతుండటం గమనార్హం. ఉదయాన్నే వెల్లుల్లి రెబ్బలు వేసిన గోరు వెచ్చని నీరు తాగితే బీపీ కంట్రోల్ లో ఉంటుంది.

రాత్రంతా నీళ్లల్లో నానబెట్టిన ఎండుద్రాక్షలు ఏడెనిమిది తింటే బీపీ అదుపులో ఉంటుందని చెప్పవచ్చు. రక్తంలోని సోడియం స్థాయిలు తగ్గేలా చేసి బీపీని అదుపులో ఉంచడంలో ఇది తోడ్పడుతుంది. గోరువెచ్చని నూనెతో ఒంటికి మసాజ్ చేస్తే నాడీ వ్యవస్థ రిలాక్సయ్యి బీపీ కంట్రోల్ లో ఉంటుంది. స్నానానికి ముందు 20 నుంచి 30 నిమిషాలు మసాజ్ చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.

తులసి నీరు, నిమ్మరసం తాగితే కూడా గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడే ఛాన్స్ ఉంటుంది. తులసిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఒత్తిడి తగ్గించే గుణాలు బీపీని కంట్రోల్ లో ఉంచుతాయని చెప్పవచ్చు. నిమ్మరసం కారణంగా శరీరంలో అధికంగా ఉన్న సోడియం బయటకుపోయి బీపీ కంట్రోల్ లో ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవన శైలి కూడా బీపీ అదుపు తప్పకుండా చేస్తుందని ఆయుర్వేదం ద్వారా తెలుస్తోంది.

ఉదయం ఆరు గంటలలోపే నిద్ర లేచి రాత్రి పది గంటల లోపు నిద్రపోవాలి. బీపీని నియంత్రించేందుకు ప్రాణాయామం కూడా కీలకమని చెప్పవచ్చు. అనులోమ విలోమ ప్రాణాయామంతో రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.