మనలో చాలామంది చెడు కొలెస్ట్రాల్ వల్ల ఇబ్బందులు పడుతుంటారు. నిశ్చల జీవనశైలి, చెడు ఆహర అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చెడు కొలెస్ట్రాల్ వల్ల కొన్నిసార్లు ప్రాణాంతక సమస్యలు సైతం వస్తాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. జంక్ ఫుడ్ వల్ల చెడు కొలెస్ట్రాల్ శరీరంలో ఏర్పడే అవకాశాలు ఉంటాయి.
నూనె వాడకం, వేపుడు పదార్థాలను తినడం, కూల్ డ్రింక్స్, వల్ల చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఇలాంటి ఆహారం ఎవరైతే తీసుకుంటారో వాళ్లు వేగంగా బరువు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. చెడు కొలెస్ట్రాల్ వల్ల డయాబెటిస్, హై బీపీ, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.
చెడు కొలెస్ట్రాల్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కండరాల నొప్పులు, రక్తంలో కొలెస్ట్రాల్ పెరగటం, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ పెరగటం వల్ల ఊబకాయం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఆహారంలో ఎక్కువగా పండ్లను తినటం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. నూనెతో తయారుచేసిన, రకరకాల పిండితో తయారు చేసిన ఆహార పదార్థాలను కాకుండా, జంక్ ఫుడ్స్ ను కాకుండా పండ్లు తీసుకుంటే బరువు కంట్రోల్ లో ఉంటుంది.
ఆరెంజ్, అవకాడో వంటి పండ్లను తీసుకోవడం వల్ల పండ్లు చెడు కొలెస్ట్రాల్ ను పెరగకుండా నియంత్రించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఓట్స్‌లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉండగా ఓట్ మీల్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడానికి కూడా ఓట్ మీల్ తోడ్పడుతుందని చెప్పవచ్చు.