మహిళల్లో రక్తహీనతకు చెక్ పెట్టే అద్భుతమైన ఆహారాలివే.. ఇవి తింటే ఎన్నో లాభాలంటూ?

నేటితరం మహిళలలో చాలామంది రక్తహీనత సమస్యతో బాధ పడుతున్నారు. రక్తహీనత సమస్య చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య వల్ల ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అయితే కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా రక్తహీనత సమస్యకు సులువుగా చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. రక్తహీనత సమస్యతో బాధ పడే మహిళలు బీట్ రూట్ తింటే మంచిది.

బీట్ రూట్ లో ఉండే నైట్రేట్స్ నైట్రిక్ ఆక్సైడ్ లుగా మారి మెరుగైన రక్తప్రసరణకు కారణమవుతాయని చెప్పవచ్చు. పాలకూర, తోటకూర తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పాలకూర, తోటకూర ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడంతో పాటు రక్తం శాతాన్ని పెంచడంలో సహాయపడతాయి. వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు ఎక్కువగా ఉండగా ఇది రక్తంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

దాల్చిన చెక్కను తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు లభించే అవకాశాలు ఉంటాయి. దాల్చిన చెక్క రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా చేయడంలో తోడ్పడుతుంది. ఉల్లిపాయలు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన సల్ఫర్, అల్లిసిన్ లభిస్తాయి. ఇవి రక్త పసరణను మెరుగుపరిచి రక్తహీనతను దూరం చేస్తాయి. ఖర్జూరాలు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి.

ఖర్జూరాలు తినడం ద్వారా శరీరానికి కావాల్సిన పొటాషియం, మెగ్నీషియం లభించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. బ్లాక్, బ్లూ, స్ట్రాబెర్రీ పండ్లు తినడం ద్వారా కూడా శరీరానికి అవసరమైన విటమిన్లు లభించే అవకాశాలు అయితే ఉంటాయి. శరీరంలోని కణాలకు ఆక్సిజన్, పోషకాల రవాణా ముఖ్యం కాగా రక్తహీనతను తగ్గించే ఆహారాలను తీసుకోవడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు.