కేంద్ర హోం శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. సాధారణ డిగ్రీ కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం 995 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది. లెవెల్-7 వేతన శ్రేణితో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎస్‌ఎస్‌సీ, రైల్వే, బ్యాంకు ఉద్యోగ ఖాళీల కోసం ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు రూ.80 వేల వరకు వేతనం లభించనుంది.
దరఖాస్తు చేసుకున్న వాళ్లు రెండు పరీక్షలు రాయాల్సి ఉండగా టైర్-1 పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో భర్తీ కానుండగా టైర్2 మాత్రం డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష ఉండనుంది. 100 మార్కులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహించడం ద్వారా ఈ ఉద్యోగ ఖాలీలను భర్తీ చేస్తారు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీ రూ.450గా ఉండగా యూఆర్, ఈడబ్ల్యుఎస్, ఓబీసీ విభాగాల పురుషులు రూ.100 పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పరీక్ష నిర్వహించనుండగా https://www.mha.gov.in/en వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.