ఈ మధ్య కాలంలో టైఫాయిడ్ వ్యాధి బారిన పడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ వ్యాధి లక్షణాలను ముందుగానే సరైన సమయంలో గుర్తించడం ద్వారా ప్రాణాలకు అపాయం కలగకుండా ఉంటుంది. టైఫాయిడ్ వచ్చేముందు చాలామంది జ్వరం బారిన పడే అవకాశాలు ఉంటాయి. తరచుగా జ్వరం వేధిస్తుంటే టైఫాయిడ్ కు సంబంధించిన పరీక్షలను చేయించుకోవాలి.
పిల్లలు ఎక్కువగా టైఫాయిడ్ బారిన పడే అవకాశం ఉండగా ఈ వ్యాధి విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. టైఫాయిడ్ నుంచి కోలుకున్నా కొన్ని నెలల పాటు వ్యాధి లక్షణాలు శరీరంలో ఉంటాయి. అందువల్ల కోలుకున్న తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. వాంతులు, వికారం, కడుపునొప్పి, కండరాల నొప్పులు, తలనొప్పి, ఆకలి లేకపోవడం టైఫాయిడ్ లక్షణాలు అని చెప్పవచ్చు.
టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ కావడంతో ఈ వ్యాధి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పవచ్చు. టైఫాయిడ్ జ్వరం అనేది సాల్మోనెల్లా టైఫై బ్యాక్టీరియా వల్ల కలిగే ప్రాణాంతకమైన వ్యాధి అని చెప్పవచ్చు. టైఫాయిడ్ జ్వరాన్ని ప్రారంభ దశలోనే గుర్తించి యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు.
టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు, సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు తినడం మంచిది. అలాగే, నీరు, పులుసులు, ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉండే పానీయాలు తాగడం ద్వారా హైడ్రేషన్‌ను కొనసాగించాలి. గంజి, మృదువైన అన్నం, కాల్చిన బంగాళాదుంపలు, పండిన అరటి, యాపిల్, బొప్పాయి వంటి పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.