ఈ 5 అదిరిపోయే చిట్కాలను ఫాలో అయితే పట్టులాంటి జుట్టు మీ సొంతం.. ఏం చేయాలంటే?

అమ్మాయిలు అందం విషయంలో ఎంతో కేర్ తీసుకుంటారనే సంగతి తెలిసిందే. జుట్టు సంరక్షణ విషయంలో, జుట్టు పెరుగుదల కోసం అమ్మాయిలు ఎన్ని చిట్కాలను ఫాలో అవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్లు, మోడల్స్ లా తమ జుట్టు ఉండాలని చాలామంది అమ్మాయిలు భావిస్తారు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా సులువుగానే పట్టులాంటి జుట్టును పొందవచ్చు.

వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా పట్టు కుచ్చులా మెరిసిపోయేలా చేసుకోవడానికి కొన్ని అదిరిపోయే చిట్కాలు ఉన్నాయి. బియ్యం నీరు ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అవుతుండగా బియ్యం నీటితో జుట్టును శుభ్రం చేసుకుని 15 నిమిషాల పాటు అలాగే ఉంచితే మంచిది. బియ్యం నీటిలో ఇనోసిటాల్ అనే సమ్మేళనం ఉండటం వల్ల జుట్టును మృదువుగా, స్ట్రైయిట్ గా చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

పెరుగును తేనెతో కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే జుట్టు సులువుగా మృదువుగా మారుతుంది. రెండు గుడ్లలో ఒక స్పూన్ ఆలివ్ నూనె కలిపి జుట్టుకు పట్టించి అరగంట సేపు అలాగే ఉంచితే జుట్టు బలోపేతం కావడంతో పాటు మృదువుగా మారుతుందని చెప్పవచ్చు. అలోవెరా జెల్ లో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే ఎంజైమ్స్ ఉంటాయి.

అలోవెరా జెల్ ను తీసి జుట్టుకు అప్లై చేసి అరగంట సేపు అలాగే ఉంచి జుట్టును శుభ్రం చేసుకుంటే మెరుగైన ఫలితాలను పొందవచ్చు. పండిన అరటిపండును మెత్తగా చేసి తేనెతో కలిపి మాస్క్ తయారు చేసుకుని అరగంట సేపు అలాగే ఉంచితే జుట్టు హైడ్రేట్ కావడంతో పాటు ఆ జుట్టుకు షైనింగ్ వస్తుంది.