ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లో ఎక్కువగా ఉపయోగించే కూరగాయలలో ఉల్లిపాయలు ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఉల్లిపాయలను నిల్వ చేసే విషయంలో కొన్ని చిట్కాలను పాటించాలి. సరైన విధంగా నిల్వ చేయడం వల్ల ఉల్లిపాయలను ఎక్కువ రోజులు వాడుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఎక్కువ రోజులు ఉల్లిపాయలు ఉండాలంటే నాణ్యమైన ఉల్లిపాయలను మాత్రమే వాడాలి.
మచ్చలు లేని గట్టిగా పొడిగా ఉన్న ఉల్లిపాయలను తీసుకుంటే మంచిది. గాలి ప్రవహించే చోట ఉల్లిపాయలను నిల్వ చేస్తే మంచిదని చెప్పవచ్చు. ఉల్లిపాయలపై సూర్యకాంతి ప్రత్యక్షంగా పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గుడ్డతో శుభ్రంగా తుడిచి ఆరబెట్టి ఉల్లిపాయలను జాగ్రత్త చేయాలి. మెష్ బ్యాగ్స్ లేదా బుట్టల సహాయంతో ఉల్లిపాయలను నిల్వ చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
బంగాళ దుంపల నుంచి ఉల్లిపాయలను దూరంగా ఉంచడం ద్వారా ఉల్లిపాయలను ఎక్కువ కాలం నిల్వ ఉంచడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఉల్లిపాయల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఉల్లిపాయలు త్వరగా పాడవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీర్ఘకాలంలో ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది.
ఉల్లిపాయలు ఎక్కువగా తినేవాళ్లు, ఇంట్లో నిల్వ చేసేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. సరైన విధంగా ఉల్లిపాయలను నిల్వ చేయడం వల్ల ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉండదని చెప్పవచ్చు.