మనలో చాలామంది జీర్ణవ్యవస్థకు సంబంధించి సమస్యలు వస్తే పెద్దగా పట్టించుకోరు. అయితే జీర్ణ వ్యవస్థ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాలకు ప్రమాదం కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. జీర్ణవ్యవస్థ దెబ్బతింటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశాలు ఉంటాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు, మలబద్ధకం, తరచూ కడుపు నొప్పి లాంటి సమస్యలు ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయి.
ఈ సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోవాలి. పేగుల్లో వివిధ రకాల హితకర బ్యాక్టీరియా వాటిలో మార్పులు వస్తే బరువు హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంటుంది. కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాలతో ఊబకాయానికి బ్యాక్టీరియా సంఖ్య పేగుల్లో పెరిగితే చివరకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి.
జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు ఉంటే చర్మ సంబంధిత సమస్యలు కూడా వేధించే అవకాశం ఉంటుంది. పేగుల్లోంచి లీకయ్యే ప్రోటీన్లను రోగనిరోధక శక్తి హానికరమైనవిగా భావించి దాడి ప్రారంభిస్తుంది. జీర్ణవ్యవస్థలో సమస్యల కారణంగా మానసిక ఇబ్బందులు తలెత్తే నిత్యం అలసటగా ఉండటం కూడా జీర్ణవ్యవస్థలో సమస్యలకు సంకేతమని వైద్యులు వెల్లడించారు.
జీవనశైలిలో మార్పులు అవసరమని వైద్యులు చెబుతున్నారు. మంచి పోషకాహారం, మెడిటేషన్, ఎక్సర్‌సైజులు చేయడం ద్వారా ప్రీ, ప్రో బయోటిక్స్ తీసుకోవడం కూడా పేగులకు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు ఉంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని చెక్ పెట్టవచ్చు.