మనలో చాలామంది నువ్వులు తినడానికి ఎంతగానో ఇష్టపడతారు. నువ్వులు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. మెదడులోని కణాలు, కండరాలను యాక్టివ్ చేసి, రక్త ప్రసరణను సులభతరం చేయడంలో నువ్వులు తోడ్పడతాయి. మతిమరుపును తగ్గించి, జ్ఞాపకశక్తిని పెంచడంలో ఇవి సహాయపడతాయని కచ్చితంగా చెప్పవచ్చు.
జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచే విషయంలో నువ్వులకు ఏవీ సాటిరావని చెప్పవచ్చు. చర్మం, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంచేలా చేయడంలో నువ్వులు తోడ్పడతాయి. కాల్షియం, మాంగనీస్‌లు ఎముకలను బలంగా చేయడానికి ఉపయోగపడతాయి. ఒమేగా-3, ఒమేగా-6, ఒమేగా-9 వంటి కొవ్వు ఆమ్లాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయని చెప్పవచ్చు.
ఇనుము, రాగి, జింక్‌లు హిమోగ్లోబిన్ సంశ్లేషణకు సహాయపడే అవకాశం ఉంటుంది. నువ్వుల నూనెలోని మినరల్స్ హృదయనాళాలను చురుకుగా పనిచేసేలా చేస్తాయని చెప్పవచ్చు. నువ్వులను సలాడ్‌లకు జోడించి తినడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాల నుండి ఉపశమనం పొందే అవకాశాలు ఉంటాయి. నువ్వుల గింజలలో ఉండే లిగ్నాన్స్, ఫైటోస్టెరాల్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
నువ్వులు కొలెస్ట్రాల్ తో పాటు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. 100 గ్రాముల నువ్వులలో 400 నుంచి 413 గ్రాముల ఫైటోస్టెరాల్ ఉంటుంది. నువ్వుల నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. నువ్వులు తీసుకోవడం ద్వారా డయాబెటిస్ కు చెక్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో నువ్వులు సహాయపడతాయి.
