ఎముకలు విరిగితే పాటించాల్సిన చిట్కాలివే.. ఇలా చేస్తే త్వరగా అతుక్కుంటాయట!

ఎముక విరిగితే, మొదటగా గాయపడిన ప్రాంతం కదలకుండా ఉంచాలి. ఎముకను తిరిగి అమర్చడానికి ప్రయత్నించకూడదు. వైద్య సహాయం కోసం వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. విరిగిన ఎముకను స్థిరీకరించడానికి స్ప్లింట్‌ను ఉపయోగించవచ్చు. తల, మెడ, మొండెం లేదా చేతులు, కాళ్ళ పొడవైన ఎముకలలో విరిగిపోయే అవకాశం ఉంటే, వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. భారీ రక్తస్రావం ఉంటే లేదా గాయపడిన నొప్పి ఎక్కువగ ఉంటే ఎముకల డాక్టర్ ను సంప్రదించాలి.

నొప్పిని తగ్గించడానికి పారాసెటమాల్ లేదా ఇబుప్రోఫెన్ వంటి మందులను వాడవచ్చు. ఎముక విరిగిన తర్వాత, మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది. విరిగిన ప్రదేశం ఆధారంగా చికిత్సలో మార్పులు ఉంటాయి. ఎక్కువ సమయాల పాటు ఏ పని చేసినా ఆ ప్రభావం ఎముకల మీద పడుతుంది అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. వాటి మీదా దృష్టి పెట్టాలి. అయితే సమస్య కారణాన్ని కనిపెట్టి, నొప్పిని అదుపుచేసే వ్యాయామాలు, చిట్కాలు అనుసరించవచ్చు.

ట్లు ఎక్కడం, ఏటవాలు ప్రదేశాల్లో నడవడం, ఏరోబిక్‌, జుంబా వ్యాయామాల్లో భాగంగా స్టెప్పర్‌ను వాడడం వల్ల కీళ్ల మీద ఒత్తిడి పెరిగి నొప్పులు పెరుగుతాయి. కాబట్టి ఈ పనులు మానుకోవాలి. అలాగే మోకాళ్లు వంచి చేసే పద్మాసనం, వజ్రాసనం వంటి యోగాసనాలు వేయకూడదు. నేల మీద బాసింపట్టా వేసి కూర్చోకూడదు.

మడమ సమస్యలతో బాధ పడేవాళ్లు మెత్తని చెప్పులు వాడాలి. షూలో సిలికాన్‌ హీల్‌ కప్స్‌ వాడాలి. చెప్పులు వేసుకునేవాళ్లు సిలికాన్‌ సాక్స్‌ వాడాలి. ఉదయం, రాత్రి గోరువెచ్చని నీళ్లలో రాతి ఉప్పు వేసి, పాదాలను పది నిమిషాల పాటు ఉంచాలి. నొప్పి తగ్గే జెల్స్‌, నూనెలు వాడవచ్చు. ఈ చిట్కాలతో సమస్య తగ్గనప్పుడు పరీక్ష్లల్లో ఇతరత్రా సమస్యలేవీ కారణం కాదని తేలినప్పుడు పి.ఆర్‌.పి ఇంజెక్షన్‌ చేయించు కోవచ్చు.