ఆధార్ కార్డ్ లో ఫోటో మార్చుకోవాలనుకుంటున్నారా.. పాటించాల్సిన అదిరిపోయే చిట్కాలివే!

ప్రతి ఒక్కరికీ అత్యంత ముఖ్యమైన కార్డ్ లలో ఆధార్ కార్డ్ ఒకటి. ఆధార్ కార్డ్ గుర్తింపు కార్డుగా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డ్ కలిగి ఉంటే దేశంలో ఎక్కడికైనా సులువుగా వెళ్లి అక్కడ దీనిని గుర్తింపు కార్డ్ గా ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు వేగంగా పొందాలని భావించే వాళ్లు ఆధార్ కార్డ్ ద్వారా ఆ పథకాల బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది.

అయితే ఆధార్ కార్డ్ లో ఉండే ఫోటో సరిగ్గా లేకపోవడం వల్ల మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు పడి ఉంటారు. https://uidai.gov.in/en/ వెబ్ సైట్ ద్వారా ఫోటోను మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. మైఆధార్‌లో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫామ్స్ డౌన్‌లోడ్ చేసుకుని ప్రింటౌట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వివరాలను ఫిల్ చేసి ఆ ఫాంతో సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లాలి.

సంబంధిత అధికారులకు ఆ ఫాం సబ్మిట్ చేసి బయోమెట్రిక్ వివరాలను నమోదు చేయాలి. ఆ సమయంలో లైవ్ ఫోటో తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఆధార్ కేంద్రంలో అక్‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్ పొంది ఆ స్లిప్ ద్వారా ఆధార్ కార్డ్ గురించి సులువుగా ట్రాక్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. 100 రూపాయలు చెల్లించడం ద్వారా ఆధార్ కార్డ్ లో ఫోటోను ఛేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా సులువుగా ఫోటోను అప్ డేట్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఆధార్ కార్డ్ ను కలిగి ఉన్నవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఫోటోలను అప్ డేట్ చేసుకుంటే మంచిది.