మనలో చాలామంది పీడకలల వల్ల ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు పడి ఉంటారు. పీడకలలు జ్ఞాపకశక్తిపై కూడా తీవ్రస్థాయిలో ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పీడకలలు వచ్చేవారికి వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి క్షీణించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. పీడ కలలు మన నిద్రమీదే కాదు మెమొరీ పవర్ పై కూడా ప్రభావం చూపుతాయి.
పీడకలలకూ విషయగ్రహణ సామర్థ్యం తగ్గటానికి, డిమెన్షియాకు సంబంధం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పీడకలలతో బాధపడే మధ్యవయసు వారికి పదేళ్ల తర్వాత విషయగ్రహణ సామర్థ్యం లోపించే ప్రమాదం 4 రెట్లు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఆడవారిలో కన్నా మగవారిలో వీటి మధ్య సంబంధం మరింత ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
డిమెన్షియా అంటే జ్ఞాపకశక్తి కోల్పోవడం, భాష, ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. బ్రెయిన్‌లోని కుడి ఫ్రంటల్ లోబ్‌లోని న్యూరోడెజెనరేషన్ వల్ల పీడకలలు ఎక్కువగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పీడకలలు కనేవారి వారి భావోద్వేగాలను నియంత్రించడం కష్టం అవుతుందని చెప్పవచ్చు. పీడకలల వల్ల కొన్నిసార్లు నిద్రకు సైతం భంగం కలుగుతుంది.
పీడకలలు తరచూ వచ్చే వాళ్లు వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. కొన్నిసార్లు మందులు వాడటం వల్ల కూడా ఈ సమస్య సులభంగా దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం పీడకలల వల్ల కలిగే నష్టం మాత్రం అంతా ఇంతా కాదు.