పోస్టాఫీస్ లో ఉద్యోగ ఖాళీల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ప్రయోజనం చేకూరేలా తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 30,000 కంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. ఈ ఏడాదిలోనే 40,000 కంటే ఎక్కువ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసిన తపాలా శాఖ మరో 30,000 ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు వేయడంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది.
ఆగష్టు నెల 3వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. పది అర్హతతో ఈ ఉద్యోగ ఖళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈరోజు నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 23వ తేదీ వరకు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. https://indiapostgdsonline.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకున్న వాళ్లు ఈ నెల 24 నుంచి 26 తేదీలలో దరఖాస్తులలో సవరణ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా పది మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. సైకిల్ తొక్కడం వచ్చి ఉండటంతో పాటు కంప్యుటర్ పరిజ్ఞానం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ స్థాయిలో వేతనం లభించనుంది. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లో పని చేసిన వాళ్లకు ఇన్సెంటివ్స్ రూపంలో కొంత మొత్తం లభిస్తుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరుతుంది.