సాధారణంగా ఈ రోజుల్లో అతి చిన్న వయస్సులోననే తెల్ల జుట్టు సమస్యతో చాలామంది యువత సతమతమవుతున్నారు. తెల్ల జుట్టు సమస్యలు తలెత్తడానికి కారణాలు ఏవైనాప్పటికీ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రమాదకర రసాయనాలు కలిగిన హెయిర్ కలర్స్ ను విచ్చలవిడిగా వినియోగించడం వల్ల చర్మ అలర్జీలు, చర్మ క్యాన్సర్లతో ఫ్యూచర్లో బాధపడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరించడం జరుగుతోంది.
అయితే తెల్ల జుట్టు సమస్యకు పరిష్కారం ఏంటి అని అనుకుంటున్నారా?మీ ఆరోగ్యం పై కొంత శ్రద్ధ కొంత సమయం కేటాయించినట్లయితే ఈ తెల్ల జుట్టు సమస్యకు సులువుగా పెట్టవచ్చు .మన వంటింట్లో ఉండే కొన్ని రకాల పదార్థాలతో తెల్ల వెంట్రుకలు, చుండ్రు సమస్య, జుట్టు రాలిపోవడం, తలలో పుండ్లు వంటి అనేక రకాల సమస్యలను సహజ పద్ధతిలో నియంత్రించుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ముందుగా ఒక గిన్నెలో ఆరు స్పూన్ల పసుపును తీసుకొని గ్యాస్ మీద పెట్టి నల్లగా అయ్యేంతవరకు వేయించుతూ ఉండాలి. నల్లగా అయిన తర్వాత కిందకు దించి పసుపులోకి కావలసినంత కొబ్బరి నూనెను వేసి మెత్తటి పేస్టులాగా కలుపుకోవాలి. కొబ్బరి నూనె కు బదులు ఆవనూనెను కూడా ఉపయోగించవచ్చు. ఈ పసుపు పేస్టు చల్లబడిన తర్వాత తల చర్మానికి, వెంట్రుకలకు అంటే విధంగా రాసుకొని గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా నెలలో రెండు లేదా మూడుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
పసుపులో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు, యాంటీ సెప్టిక్ గుణాలు తలలో చుండ్రు, పుండ్లు సమస్యలను తగ్గించడమే కాకుండా వెంట్రుకలు దృఢంగా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. తద్వారా సహజ పద్ధతిలో తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాను ఎవరైనా ఉపయోగించవచ్చు ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కావున ఎవరైనా ఈ చిట్కాను నిక్షేపంగా పాటించవచ్చు.