ఏపీలోని నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. భారీ వేతనంతో 875 ఉద్యోగ ఖాళీలు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాలయం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాకినాడ కార్యాలయం నుంచి నిరుద్యోగులకు బెనిఫిట్ కలిగేలా 875 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ధాన్యం సేకరణ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. ఎంపికైన వాళ్లు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి కాంట్రాక్ట్ సమయం 2 నెలలుగా ఉండనుంది. 21 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అగ్రికల్చర్, మైక్రోబయోలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఇతర విభాగాలలో డిగ్రీ చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయో పరిమితి 45 సంవత్సరాలుగా ఉండనుందని సమాచారం అందుతోంది.

డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని సమాచారం అందుతోంది. టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇది అర్హత కాగా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు డిగ్రీ చేసిన అభ్యర్థులు ఆర్హత కలిగి ఉంటారు. కంప్యూటర్ అప్లికేషన్ లో పీజీ డిప్లొమా చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గరిష్ట వయస్సు 45 సంవత్సరాలుగా ఉండనుంది.

హెల్పర్స్ ఉద్యోగ ఖాళీలకు 8 నుంచి 10వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయో పరిమితిలో ఐదేళ్ల సడలింపు ఉండనుందని సమాచారం అందుతోంది. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.