మనలో చాలామంది బట్టల కోసం ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో బట్టలు తక్కువ సమయంలోనే రంగుని కోల్పోతూ పాతవాటిలా కనిపిస్తూ ఉంటాయి. ఉతకడంలో చేసే చిన్నచిన్న తప్పుల వల్ల బట్టలు రంగు మారే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా బట్టలు ఎక్కువరోజుల పాటు కొత్తవాటిలా కనిపించే అవకాశం ఉంటుంది.
బట్టలు ఉతికే ముందు ఉప్పు నీటిలో నానబెట్టడం లేదా బకెట్ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తర్వాత ఉతకడం ద్వారా బట్టలు ఎక్కువరోజులు ఫ్రెష్ గా ఉంటాయి. కొత్త బట్టలు ఉతికే ముందు కప్పున్నర వెనిగర్‌ని నీటిలో పోసి నానబెట్టి తర్వాత ఉతికితే మంచిది. ఈ విధంగా వెనిగర్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్‌లా పని చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎక్కువగా బట్టలు ఉతకడం వల్ల వాటి మెరుపు తగ్గిపోతుందని గుర్తు పెట్టుకోవాలి. తక్కువ సమయం వేసుకున్న బట్టలను ఉతకాల్సిన అవసరం అయితే లేదు.
బట్టలు త్వరగా ఆరడానికి చాలా మంది డ్రైయర్స్ ను ఉపయోగించడం జరుగుతుంది. రెగ్యులర్‌గా డ్రైయర్స్ వాడడం వల్ల బట్టలు గరుకుగా మారడంతో పాటు త్వరగా పాడయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. బట్టలు సహజంగా గాలికి ఆరేలా జాగ్రత్తలు తీసుకుంటే వాటి మెరుపు చెక్కు చెదిరే అవకాశాలు అయితే ఉండవని చెప్పవచ్చు. బట్టల్ని నేరుగా ఎండలో ఆరబెట్టడం వల్ల కూడా వాటి మెరుపు తగ్గుతుంది.
సహజంగా నీడలో ఆరబెట్టడం ద్వారా బట్టలపై సూర్యరశ్మి ఎఫెక్ట్ ఉండదు. బట్టలు కొన్న సమయంలో వాటిపై కొన్ని సూచనలు ఉంటాయి. ఆ సూచనలను పాటిస్తూ బట్టలు ఉతకడం ద్వారా బట్టలపై మెరుపు ఎప్పటికీ ఉంటుంది. చల్లటి నీటిలోనే బట్టలను ఉతకడం ద్వారా బట్టలు ఎప్పుడూ ఫ్రెష్ గా ఉంటాయి. బట్టలు ఉతికాక వాటిని మంచి కండీషనర్‌లో కనీసం 15 నిమిషల పాటు నానబెట్టి ఆరేస్తే మంచిది. బట్టలను వీలైనంత సున్నితంగా ఉతకాలి.