రైల్వేలో 550 ఉద్యోగ ఖాళీలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే?

రైల్వేలో ఉద్యోగ ఖాళీల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు అదిరిపోయే ప్రకటన వెలువడింది. 550 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల కావడం గమనార్హం. మార్చి 4వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండగా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది.

https://rcf.indianrailways.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకునే అవకాశంఅయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా వేర్వేరు విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ ఉద్యోగాలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

పదో తరగతి వరకు చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ఐటీఐను సంబంధిత విభాగంలో పూర్తి చేసిన వాళ్లు కూడా ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. గుర్తింపు కార్డులను సైతం కలిగి ఉండాలి. సంబంధిత వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ మొత్తం వేతనంగా లభించనుంది. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.