మీ జుట్టు ఎక్కువగా రాలిపోతుందా.. ఈ చిట్కాలను పాటిస్తే జుట్టు రాలే సమస్యలకు చెక్!

పురుషులలో చాలామంది ప్రస్తుత కాలంలో వాతావరణ సమస్యలు, ఇతర కారణాల వల్ల జుట్టు సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. జుట్టు రాలడానికి వేర్వేరు వైద్య పరిస్థితులు కారణం అవుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జుట్టు రాలడానికి చుండ్రుకు కారణమయ్యే ప్రత్యేక వైద్య పరిస్థితులు ఉంటాయి. అమ్మాయిలలో జుట్టు రాలడానికి థైరాయిడ్ కారణమవుతుంది.

హైపర్ థైరాయిడిజం లేదా హైపోథైరాయిడిజం వల్ల జుట్టు రాలే అవకాశాలు అయితే ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్లు జుట్టు పెరుగుదలతో సహా అనేక శారీరక విధుల్లో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు. థైరాయిడ్ రుగ్మతలకు సరైన చికిత్స తీసుకోవడం ద్వారా హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి. జుట్టు రాలడం తగ్గడంతో పాటు కొత్త జుట్టు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

జన్యుపరమైన సమస్యల వల్ల కూడా కొంతమంది జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. వయస్సు పెరిగే కొద్దీ జుట్టు రాలడం అనేది సాధారణ సమస్యగా మారుతుంది. పోషకాహార లోపాల సమస్య వల్ల ఇబ్బందులు పడేవాళ్లు ఆ లోపాలను అధిగమించే ఆహారం తీసుకోవడం ద్వారా సమస్యలకు చెక్ పెట్టే ఛాన్స్ అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు.

క్యాన్సర్, ఆర్థరైటిస్, డిప్రెషన్, గుండె జబ్బులు, గౌట్ అధిక రక్తపోటు సమస్యలు దీర్ఘకాలికంగా కలిగించే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. క్యాన్సర్ కోసం ఉపయోగించే రేడియేషన్‌ ట్రీట్‌మెంట్‌ వల్ల కూడా జుట్టు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.