నిట్ లో 150 నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కాలికట్‌ నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. 150 నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగ ఖాళీలలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగ ఖాళీలు 30 ఉండగా సూపరింటెండెంట్‌ ఉద్యోగ ఖాళీలు 10, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌ ఉద్యోగ ఖాళీలు 3, సీనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగ ఖాళీలు 10, జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగ ఖాళీలు 7 ఉన్నాయి.

ల్యాబ్‌ అటెండెంట్‌ ఉద్యోగ ఖాళీలు 15 ఉండగా ఆఫీస్‌ అటెండెంట్‌ ఉద్యోగ ఖాళీలు 7, టెక్నీషియన్‌ ఉద్యోగ ఖాళీలు 30, జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగ ఖాళీలు 24, సీనియర్‌ టెక్నీషియన్‌ ఉద్యోగ ఖాళీలు 14 ఉన్నాయి. సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. కొన్ని ఉద్యోగ ఖాళీలకు ఇంటర్ అర్హత కూడా సరిపోతుంది. https://nitc.ac.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఆన్ లైన్ దరఖాస్తుకు 2023 సంవత్సరం సెప్టెంబర్ నెల 6వ తేదీ చివరి తేదీగా ఉంది. రాతపరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది.

వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో బెనిఫిట్ కలగనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు వేతనం భారీ స్థాయిలోనే ఉండనుందని తెలుస్తోంది. రైట్స్ నుంచి మరో 16 ఉద్యోగ ఖాళీల కోసం కూడా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది.