బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కావాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 2140 కానిస్టేబుల్ ఉద్యోగాలకు భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల కాగా కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మన్) ఉద్యోగ ఖాళీలపై ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
rectt.bsf.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఈ జాబ్ నోటిఫికేషన్ నిరుద్యోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. త్వరలో ఈ ఉద్యోగాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుకానుందని సమాచారం అందుతోంది.
ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలలో 1723 పోస్టులు పురుషులకు కేటాయించగా 417 పోస్టులను మాత్రం మహిళలకు కేటాయించడం గమనార్హం. 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా అర్హతల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయి.
గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదో తరగతి లేదా అందుకు సమానమైన కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసి ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. రాతపరీక్ష ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్స్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 69,100 రూపాయల వరకు వేతనం లభించనుంది.