బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. హెడ్ కానిస్టేబుల్,కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం భారీ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మొత్తం 38 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత,ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో కూడా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఈ ఉద్యోగ ఖాళీలలో కానిస్టేబుల్ (జనరేటర్ మెకానిక్) ఉద్యోగ ఖాళీలు 14 ఉండగా కానిస్టేబుల్ (జనరేటర్ ఆపరేటర్) ఉద్యోగ ఖాళీలు 13 ఉన్నాయి. కానిస్టేబుల్ (లైన్‌మ్యాన్) ఉద్యోగ ఖాళీలు 9 ఉండగా హెడ్ కానిస్టేబుల్ (కార్పెంటర్) జాబ్ 1, హెడ్ కానిస్టేబుల్ (ప్లంబర్) 1 ఉన్నాయి. మొత్తం 38 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.
18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన గరిష్టంగా 81100 రూపాయల వరకు వేతనం లభించనుంది. రాతపరీక్షతో పాటు , ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ప్రాక్టికల్/ట్రేడ్ టెస్ట్,మెడికల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది.
అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతుంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఉద్యోగ ఖాళీల కోసం ఎదురుచూసే వాళ్లు ఈ జాబ్ నోటిఫికేషన్ పై దృష్టి పెడితే మంచిది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడంతో వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలపై దృష్టి పెడితే మంచిది.