చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు మన కెరీర్ కు ఎంతో ఉపయోగపడేలా ఉంటాయనే సంగతి తెలిసిందే. చాణక్యుడి నీతి సూత్రాలను పాటించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. చాణక్యుడు ఒక వ్యక్తి పుట్టుకతో గొప్పవాడు కాదని చేసే పనుల వల్ల మాత్రమే గొప్పవాడు అవుతాడని చెప్పారు. ఒక వ్యక్తి చాలా నిజాయితీగా ఉండకూడదని నిటారు చెట్లే మొదట కోయబడతాయని చాణక్యుడు చెప్పుకొచ్చారు.
చదువుకున్న వ్యక్తి ప్రతిచోటా గౌరవించబడతాడని విద్య అనేది అందాన్ని, వయస్సును కూడా అధిగమిస్తుందని చాణక్యుడు వెల్లడించారు. కుటుంబ సభ్యులతో ఎవరైతే మితిమీరే సంబంధాలను కలిగి ఉంటారో వాళ్లు ఎక్కువగా దుఃఖాన్ని అనుభవిస్తారని చాణక్యుడు పేర్కొన్నారు. అప్పు శత్రువులాంటిదని చాణక్యుడు పేర్కొన్నారు. అనుకువుగా ఉండటం స్వయం నియంత్రణ కు మూలం అని చాణక్యుడు వెల్లడించారు.
దేవుడు విగ్రహాల్లో వుండడు అని మీ భావాలే దేవుడు అని చాణక్యుడు పేర్కొన్నారు. మనల్ని మనం గొప్పవారిగా భావించకూడదని మన పుణ్య కర్మలే మాత్రమే మన మిత్రులు అని చాణక్యుడు పేర్కొన్నారు. పరిజ్ఞానం అనేది పుస్తకాలు, ఇతర వస్తువులలో పరిమితమైనది కాదని చాణక్యుడు వెల్లడించారు. సమయం అనేది మనుషులను గొప్పవారిగానైనా చేస్తుందని లేదా నాశనమైనా చేస్తుందని చాణక్యుడు వెల్లడించారు.
పూలలోని పరిమళం వీచే గాలిని బట్టి వ్యాపిస్తోందని మనిషి యొక్క మంచితనం అన్ని దిశల్లో వ్యాపిస్తుందని చాణక్యుడు తెలిపారు. భయం నీ దగ్గరికి చేరినప్పుడు దాని పైన దాడి చేసి నాశనం చేయాలని చాణక్యుడు అన్నారు. వ్యక్తిగత ఆసక్తి లేకుండా ఎటువంటి స్నేహ బంధం ఉండదని చాణక్యుడు చెప్పుకొచ్చారు. ఇతరుల పొరపాట్ల నుంచే చూసి నేర్చుకోవాలని అన్నింటినీ సొంతంగా తెలుసుకోలేవని చాణక్యుడు పేర్కొన్నారు.
నీ భావాలపై విజయం సాధించడం అంటే అది గొప్ప స్థితికి మూలమని చాణక్యుడు వెల్లడించారు. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దని అది మిమ్మల్ని నాశనం చేస్తుందని చాణక్యుడు తెలిపారు. చాణక్యుడు చెప్పిన ఈ జీవిత సత్యాలను పాటిస్తే మంచిది.