Samantha: ఏ మాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన సమంత మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకొని వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సమంత కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల అనారోగ్య సమస్యల వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ఇప్పుడే పరిస్థితులు అన్నీ చక్కబడటంతో ఈమె తిరిగి సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.
ఇక సమంత ప్రస్తుతం హీరోయిన్గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారిన విషయం తెలిసిందే. ఇలా తన నిర్మాణ సంస్థలో సమంత నిర్మించిన శుభం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సమంత వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి అలాగే వృత్తిపరమైన విషయాల గురించి కూడా స్పందించారు.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ… నేను ఎప్పుడూ కూడా సక్సెస్ ను తలకు ఎక్కించుకోను అలా మనం మన సక్సెస్ తలకు ఎక్కించుకుంటే కిందకు పడిపోవాల్సి ఉంటుంది. నా కెరియర్ తొలినాళ్లలో ఎన్నో సక్సెస్ సినిమాలను అందుకున్నాను. అలాగే ఫెయిల్యూర్స్ కూడా అందుకున్నాను. మన జీవితంలో మనకు కఠిరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటి నుంచి ఎలా బయటపడాలనే విషయాలను నిత్యం నేర్చుకుంటున్నానని సమంత తెలిపారు.
నేను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడే నాకు పుష్ప సినిమాలో ఊ అంటావా మావ సాంగ్ చేసే ఆఫర్ వచ్చింది. అప్పటివరకు నేను అలాంటి సాంగ్స్ అసలు చేయలేదు ఈ సాంగ్ చేసేటప్పుడు చాలా టెన్షన్ పడ్డానని, ఈ పాటను ప్రేక్షకులు ఆదరిస్తారా అనే సందేహం కూడా నాలో ఉండేదని తెలిపారు. నేను హాట్ గా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఆ పాటను ప్రేక్షకులు పెద్ద హిట్ చేశారని సమంత తెలిపారు. అయితే ఇక పై అలాంటి సాంగ్స్ అస్సలు చేయనని ఈమె తెలిపారు.ప్రస్తుతానికి వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి. మంచి స్క్రిప్ట్ ఉన్న సినిమాలను చేయాలని చూస్తున్నాను. త్వరలోనే మా ఇంటి బంగారం మూవీ సెట్స్ లో పాల్గొంటా అంటూ సమంత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.