సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 835 ఉద్యోగ ఖాళీలు.. ఒకింత మంచి వేతనంతో?

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి నెల 25వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు ఉద్యోగ ఖాళీలు భర్తీ కానున్నాయని సమాచారం అందుతోంది.

కార్పెంటర్, సీఓపీఏ, డ్రాఫ్ట్స్ మెన్ సివిల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రీషియన్ మెకానిక్, ఫిట్టర్, మెషనిస్ట్, పెయింటర్, ప్లంబర్, మెకానిక్ ఏఆర్సీ, ఎస్.ఎం.డబ్ల్యూ, స్టెనో ఇంగ్లీష్, స్టెనో హిందీ, డీజిల్ మెకానిక్, టర్నర్, వెల్డర్, వైర్ మేన్, కెమికల్ లాబొరేటరీ అసిస్టెంట్, డిజిటల్ ఫోటోగ్రాఫర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండటం గమనార్హం.

సంబంధిత విభాగంలో పది, ఇంటర్, ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. 2025 సంవత్సరం మార్చి 25 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. మార్చి 25 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు దీర్ఘకాలంలో ఎంతో బెనిఫిట్ కలిగే అవకాశం ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఒకింత మంచి వేతనం లభించనుందని తెలుస్తోంది.