ఇంటర్ అర్హతతో 1207 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

కేంద్ర ప్రభుత్వ సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 1207 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా స్టెనోగ్రాఫర్ సి, స్టెనోగ్రాఫర్ డి ఉద్యోగ ఖాళీలను ఈ సంస్థ భర్తీ చేయనుందని సమాచారం అందుతోంది. ఆన్లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ జాబ్ నోటిఫికేషన్ లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి ఉద్యోగ ఖాళీలు 93 ఉండగా మిగతా ఉద్యోగ ఖాళీలు 1114 ఉన్నాయి. ఇంటర్ పాసైన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది. స్టెనోగ్రాఫర్ ఉద్యోగ ఖాళీలకు 33 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు అర్హులు కాగా మిగతా ఉద్యోగాలకు 27 సంవత్సరాల లోపు వయస్సు వాళ్లు అర్హులు.

ఇంటర్ పాసైన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కేటగిరీల వారీగా వయో పరిమితిలో సడలింపులు ఉండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉండనుంది. దరఖాస్తులో పొరపాట్లు ఉంటే ఆగష్టు నెల 25వ తేదీకి సరిదిద్దుకునే ఛాన్స్ ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ప్రధాన కేంద్రాలు ఉన్నాయి. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.