భారీ వేతనంతో 108 సర్వీస్ లో ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. భారీ వేతనంతో 108 సర్వీస్ లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. పూతలపట్టు, తవనంపల్లి, చిత్తూరు, పలమనేరు, వీకోట ,కుప్పంలో ఉద్యోగ ఖాళీలు భర్తీ కానున్నాయి. బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ లైఫ్ సైన్స్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

జాబ్ లేదని బాధపడే వాళ్లకు ఇది అద్భుతమైన అవకాశం అనే చెప్పాలి. 742496802, 8019874684, 9502214614 ఫోన్ నంబర్లను సంప్రదించడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. 108 కార్యాలయం చిత్తూరులో సంప్రదించడం ద్వారా కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించి మరిన్నివివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 16,700 రూపాయల వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. ఎలాంటి పరీక్ష లేకుండా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 15 రోజుల పాటు ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. నవంబర్ 17వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. 108సర్వీస్ లో ఉద్యోగం చేయాలని భావించే వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

108 సర్వీస్ లో ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ ఉద్యోగంలో చేరిన వాళ్లకు ప్రజలకు సేవ చేశామనే భావన సైతం కలుగుతుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది. త్వరలో ఏపీ ప్రభుత్వం మరిన్ని జాబ్ నోటిఫికేషన్ల దిశగా అడుగులు వేస్తోంది.