Chandra Babu: అప్పుల కుప్పగా మారిన రాష్ట్రం… సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

Chandra Babu: ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారింది అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఈయన కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2014 నుంచి 19 వరకు తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నడిపించాను. గత ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేశారు అంటూ ఈయన మండిపడ్డారు.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి సుమారు నాలుగు శాతం ఆదాయం తగ్గిపోయిందని, గత ఐదేళ్లలో ఈ జగన్ వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని బాబు తెలిపారు.తన నియోజకవర్గం అని కుప్పంపై కక్ష సాధింపునకు దిగారని వ్యాఖ్యానించారు. కుప్పంలో టిడిపి నేతలపై అన్యాయంగా కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేశారని చంద్రబాబు తెలిపారు.

మన ప్రభుత్వ హయామంలో కుప్పాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని అందుకు సంబంధించి ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.కుప్పానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. కష్టపడకుండా అభివృద్ధి జరగదన్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కుప్పంలో మరో పార్టీకి విజయం దక్కడం లేదని కుప్పం తెలుగుదేశం పార్టీ కంచుకోట అంటూ చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తన నియోజకవర్గం పై ప్రేమ కురిపించారు.

ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను ప్రకటించిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే రాష్ట్రం మొత్తం అప్పులలో ఉందని సంక్షేమ పథకాలను చూస్తుంటే భయం వేస్తుందని పలు సందర్భాలలో తెలియచేశారు. పెద్ద ఎత్తున అప్పులు చేయటం వల్లే సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోతున్నామని ఈయన వెల్లడించారు.